కామారెడ్డిటౌన్, వెలుగు: పొలిటికల్ పార్టీలు తప్పనిసరిగా బూత్లెవల్ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ జితేశ్వి పాటిల్సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో పార్టీల ప్రతినిధులతో ఓటర్ల లిస్టులో మార్పులు, చేర్పులపై మీటింగ్ నిర్వహించారు.
ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ లిస్ట్‌పై అభ్యంతరాలు ఉంటే తెలపాలన్నారు. ఓటరు లిస్ట్ నుంచి చనిపోయిన వ్యక్తుల పేర్లు తొలగిస్తామని చెప్పారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉంటే ఒకచోట తొలగిస్తామన్నారు.
జనవరి 6న డ్రాప్టు రోల్ పబ్లిష్ చేస్తామన్నారు. తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వలస వెళ్లిన ఓటర్ల వివరాలు కూడా సేకరిస్తామన్నారు. కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రపోజల్స్ రెడీ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అనిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.