హాంగ్జౌ: ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇండియా టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్నకు మెన్స్ డబుల్స్‌లో షాక్ తగిలింది. యూకీ భాంబ్రీతో కలిసి టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన బోపన్న రెండో రౌండ్‌లోనే వైదొలిగాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బోపన్న–భాంబ్రీ జోడీ 6–2, 3–6, 6–10తో అనామకులైన సెర్గే ఫొమిన్–ఖుమొయున్ సల్తనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో కంగుతిన్నది. టాప్10 ర్యాంక్ ప్లేయర్ అయిన బోపన్న, టాప్100లోని భాంబ్రీ.. టాప్300 ర్యాంక్‌లో కూడా లేని జంట చేతిలో పరాజయం పాలై నిరాశ పరిచింది. మరో మ్యాచ్‌లో సాకేత్ మైనేని–రామ్ కుమార్ జోడీ 6–3, 6–2తో సుసంటో–డేవిడ్ అగుంగ్ (ఇండోనేసియా)ను ఓడించి క్వార్టర్స్ చేరింది. విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో అంకితా రైనా 6–0, 6–0తో సబ్రినా (ఉజ్బెకిస్తాన్)ను , రుతుజా భోసలే 7–6 (7/2), 6–2తో అరుజాన్ (కజకిస్తాన్)ను ఓడించి ప్రిక్వార్టర్స్ చేరారు. మెన్స్ సింగిల్స్‌లో ప్రత్యర్థి వాకోవర్ ఇవ్వడంతో రామ్‌కుమార్ ముందంజ వేశాడు.
ప్రిక్వార్టర్స్‌లో దీపక్, నిశాంత్
వరల్డ్ చాంపియన్‌షిప్ బ్రాంజ్ మెడలిస్ట్ దీపక్ భోరియా, నిశాంత్ దేవ్ మెన్స్ బాక్సింగ్‌లో ప్రిక్వార్టర్స్ చేరుకున్నారు. మెన్స్ 51 కేజీ తొలి బౌట్‌లో దీపక్ 5–0తో మలేసియాకు చెందిన ముహమమ్మద్ అబ్దుల్ బిన్‌ను చిత్తు చేశాడు. 71 కేజీ ఓపెనింగ్ బౌట్‌లో నిశాంత్ సైతం 5–0తో దీపేశ్ లామా (నేపాల్)ను ఓడించాడు. కానీ, విమెన్స్ 66 కేజీల బౌట్‌లో అరుంధతి 0–5తో చైనాకు చెందిన వరల్డ్ చాంపియన్ యాంగ్ లియు చేతిలో ఓడిపోయింది.
ర్యాపిడ్ చెస్ మెన్స్‌లో విదిత్ సంతోష్ 3,4వ రౌండ్లలో విజయం సాధించగా.. ఎరిగైసి అర్జున్ మూడో రౌండ్‌లో గెలిచి నాలుగో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. విమెన్స్మూడో రౌండ్‌లో హారిక, నాలుగో రౌండ్‌లో హంపి చైనా టాప్ సీడ్ హౌ యిఫన్ చేతిలో ఓడారు. మరో రౌండ్‌లో ఇద్దరూ డ్రాతో సరిపెట్టారు.
జూడో విమెన్స్ 70 కేజీ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన గరిమా చౌదరి టోర్నీ నుంచి వైదొలిగింది.
స్విమ్మింగ్‌లో ఇండియా స్టార్ శ్రీహరి నటరాజన్ మరోసారి నిరాశ పరిచాడు. మెన్స్ 50 మీ. బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్లో శ్రీహరి 25.39 సెకండ్లతో ఆరో ప్లేస్‌తో సరిపెట్టాడు. మెన్స్ 4X200మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో ఇండియా 7:29.23సెకండ్లతో ఏడో ప్లేస్‌తో నిరాశపరిచింది.