మిర్యాలగూడ, వెలుగు : మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి అవకాశం కల్పించాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పని నగేశ్ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించే ఉద్దేశంతో కాంగ్రెస్ పెద్దలు తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వివేక్ వెంకటస్వామికి మినిస్టర్ గా అవకాశం ఇస్తే బడుగు బలహీన వర్గాలతోపాటు ఇతర పేదలకు భరోసాగా ఉంటుందన్నారు. వివేక్ కు మంత్రి పదవి ఇచ్చే విషయమై సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.