గోదావరిఖని, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, చత్తీస్గఢ్రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాలకు చెందిన పోలీస్ ఆఫీసర్లు శనివారం గడ్చిరోలి జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో మీటింగ్ నిర్వహించారు. మీటింగ్‌కు రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్, గడ్చిరోలి డీఐజీ అంకిత్ గోయల్, సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ ఐజీ ఎన్.మీనా, గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్, గోండియా ఎస్పీ నిఖిల్ పింగళ్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే, ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. మూడు రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఆఫీసర్లు అశోక్ కుమార్, చింత కుమార్, యతీశ్దేశ్ముఖ్, ఎం.రమేశ్, వైభవ్ బంకర్, సందీప్‌కుమార్ పటేల్, తాజేవ్వర్ దివాన్, అజిత్‌ఓగ్రే, సుభాశ్ షిండే పాల్గొన్నారు.