Test cricket: ఏడాదిలో మూడు బ్లాక్ బస్టర్ సిరీస్‌లు.. టెస్ట్ క్రికెట్ ఆదరణ పెరిగేనా..?

Test cricket: ఏడాదిలో మూడు బ్లాక్ బస్టర్ సిరీస్‌లు.. టెస్ట్ క్రికెట్ ఆదరణ పెరిగేనా..?

ధనాధన్ టీ20 క్రికెట్ దే ఇప్పుడు హవా. అభిమానులకు వన్డే క్రికెట్ ను ఓపిగ్గా చూసే ఆసక్తి పోయింది. ఇక టెస్ట్ క్రికెట్ అంటే ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. ఇంగ్లాండ్ బజ్ బాల్ అంటూ టెస్ట్ క్రికెట్ లో మజా చూపించినా మిగిలిన జట్ల మ్యాచ్ లు చూడాలంటే క్రికెట్ ప్రేమికులకు విసుగు వస్తుంది. అయితే 14 నెలల్లో మూడు బ్లాక్ బస్టర్ టెస్ట్ మ్యాచ్ లు అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  

భారత్- ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ:

2024 నవంబర్ నుంచి ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపై భారీ హైప్ నెలకొంది. మూడు నెలల సమయమున్నా ఈ సిరీస్ పై ఇప్పటి నుంచే ఇరు జట్లు సన్నాహాలు ప్రారంభిస్తున్నారు. సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది. 

Also Read :-  ఆ ఛాన్స్ వస్తే ఒక రోజు ధోనీలా మారాలని ఉంది

భారత్- ఇంగ్లాండ్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్

భారత్, ఇంగ్లాండ్ ల మధ్య జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ మరో ప్రధాన సిరీస్. వచ్చే ఏడాది (2025) లో ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య జరిగే ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖరారైంది. ఈ మేరకు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు (ఈసీబీ) తేదీలను, వేదికలను ప్రకటించింది. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టీమిండియా నాలుగో వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూటీసీ 2025–2027)ను మొదలుపెట్టనుంది. ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లకు అనుకూలంగా ఉండేలా ఈసీబీ వేదికలను ఖరారు చేసింది. జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20 నుంచి 24 వరకు తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (లీడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) జరగనుంది. జులై 2 నుంచి 6 వరకు రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బర్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), 10 నుంచి 14 వరకు మూడో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (లార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), 23 నుంచి 27 వరకు నాలుగో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (మాంచెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 31 నుంచి ఆగస్టు 4 వరకు ఐదో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఓవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) జరగనున్నాయి.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ యాషెస్

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మక సిరీస్ 2025 నవంబర్ లో ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ లో ఆతిధ్యమిస్తున్న ఈ సిరీస్ కు షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. ఈ మూడు సిరీస్ లు అగ్ర శ్రేణి జట్ల మధ్య జరగనుండడం.. 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కావడంతో టెస్ట్ క్రికెట్ ఆదరణ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. వీటితో 2025 లోనే టెస్ట్ ఛాంపియన్ షిప్ జరగనుంది.