![ఎమ్మెల్యే సునీత 15 ఎకరాలు కబ్జా చేశారు: బోరెడ్డి అయోధ్య రెడ్డి](https://static.v6velugu.com/uploads/2023/09/Boreddy-Ayodhya-Reddy-alleges-that-MLA-Sunitha_cSR0Etxyqh.jpg)
హైదరాబాద్, వెలుగు: టీఎస్ఐఐసీ పరిధిలోని 15 ఎకరాల భూమిని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కబ్జా చేశారని పీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కాకముందు తెల్ల రేషన్‌కార్డు ఉన్న ఆమెకు ఇప్పుడు వందల కోట్లు ఎట్లా వచ్చాయని ప్రశ్నించారు. ‘‘టీఎస్ఐఐసీ కోసం తుర్కపల్లిలో భూ సేకరణ చేస్తున్నారు.
సర్వే నంబర్ 72లో 155 ఎకరాల భూమి ఉంటే.. 108 ఎకరాల భూమికి నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో టీఎస్ఐఐసీ తీసుకున్నది 93 ఎకరాలు. మిగతా 15 ఎకరాలు ఎమ్మెల్యే సునీత కబ్జా చేశారు. 43 మంది రైతుల దగ్గర తీసుకున్న భూమికి ప్రభుత్వం చెక్కులు ఇచ్చినా.. అవి బౌన్స్ అయ్యాయి’’ అని అయోధ్య రెడ్డి అన్నారు.