బోరింగ్, లైఫ్లెస్ బడ్జెట్..భారత్ పే కోఫౌండర్ అష్నీర్ గ్రోవర్

బోరింగ్, లైఫ్లెస్ బడ్జెట్..భారత్ పే కోఫౌండర్ అష్నీర్ గ్రోవర్

కేంద్ర బడ్జెట్పై ‘భారత్ పే’ కోఫౌండర్ అష్పీర్ గ్రోవర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోరింగ్, లైఫ్ లెస్, మీనింగ్ లెస్ బడ్జెట్ అని అన్నారు. సమయం వృధా.. దీనికన్నా ఇంకో అంబానీ వెడ్డింగ్ ఫంక్షన్ లో పాల్గొంటే బాగుండేది అన్నారు. మంగళవారం (జూలై 23, 2024) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించిన తర్వాత భారత్ పే సహా వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ మోదీ 3.0 బడ్జెట్ పై బోల్డ్ రియాక్షన్ ని సోషల్ మీడియా X లో పోస్ట్ చేశారు. 

బడ్జెట్ 2024 .. బోరింగ్, లైఫ్ లెస్, మీనింగ్ లెస్ అని పోస్ట్ చేశారు. ఈ బడ్జెట్ ను బట్వాడా చేయడానికి బదులుగా .. ఈసారి చేయడానికి  మనసు ఒప్పడం లేదు.. ఇంకోసారి కొంత చేస్తామని చెబితే బాగుండేది అని అష్నీర్ గ్రోవర్ ట్వీట్ లో చెప్పారు. వాస్తవానికి దీనికన్నా మరో అంబానీ పెళ్లి వేడుకలను చూడటం చాలా బాగుండేది.. మరింత విలువైన  సమయాన్ని ఎంటర్ టైన్ అయ్యేది అని అన్నారు అష్నీర్ గ్రోవర్. 

Also Read:-కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం

గ్రోవర్స్ పోస్ట్ కు నెటిజన్ల నుంచి చాలా స్పందనలు వచ్చాయి. X  వినియోగదారుల్లో ఒకరు స్పందిస్తూ.. ఇది బడ్జెట్ ఎపిసోడ్ లా గా అనిపించింది. వచ్చే బడ్జెట్ మంచి ఉత్సాహాన్ని అందిస్తుండొచ్చు.. అప్పటివరకు కొంత ఎంటర్ టైన్ మెంట్ కు అంబానీ వివాహాలను ఆస్వాదిద్దాం అని రాశారు. ఇంకో స్పందిస్తూ.. మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అహంకారం పెరిగిందంటూ ఘాటుగా విమర్శించాడు. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో వరుసగా ఏడో సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ పన్ను తగ్గింపు టాప్ సవరించిన పన్ను స్లాబ్ లన నుంచి ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ సారి ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం 80 నిమిషాల పాటు సాగింది.