ఆయనకు రెండు చేతులు లేవు. కానీ, మనోబలం నిండుగా ఉంది. బాగా చదివి ప్రయోజకుడు కావాలనే లక్ష్యం అతడిని వైకల్యాన్ని మరిపించింది.చదవడం సులభమే.. కానీ,చేతులు లేకుండా పరీక్ష రాయడం ఎలా? అని అనుకున్నాడు. తన కాళ్లనే చేతులుగా మలచుకున్నాడు. పోటీ పరీక్షలో విజయంసాధించాడు. మధ్యప్రదేశ్ లో జరిగిన పట్వారీ పరీక్షల్లో అమీన్ మన్సూరి టాపర్ గా నిలిచి ఔరా అనిపించాడు.
ఈ రోజుల్లో అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే పనిచేయడానికి బద్దకిస్తున్నారు. అయితే, మధ్యప్రదేశ్ లో జరిగిన పట్వారీ పరీక్షల్లో అమీన్ మన్సూరి టాపర్ గా నిలిచాడు.ఎవరిపై ఆధారపడకుండా తన పనులు తానే చేసుకుంటున్నాడు. అమీన్ మన్సూరీకి పుట్టుకనుంచే చేతులులేకపోవడం వల్ల కాళ్లవేళ్ల మధ్యపెన్ పెట్టుకుని రాసేవాడు
కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ దివ్యాంగుడు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాకు చెందిన అమీన్ మన్సూరి పుట్టుకతోనే చేతులు లేకుండా జన్మించాడు. కాళ్ల సహాయంతో పరీక్ష రాసి తన లక్ష్యాన్ని చేధించాడు. మన్సూరీ పట్వారీ పరీక్షలో మొదటి ప్రయత్నంలో విజయం సాధించాడు. పట్వారీ పరీక్షలో200 మార్కులకు 127 మార్కులు సాధించాడు. అంతేకాదు దేవాస్ జిల్లాలో లోకోమోటర్ వైకల్యంలో టాపర్‌గా నిలిచాడు. అతని విజయం ప్రస్తుతం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు అతను వందలాది గ్రామస్తులకు ఆదర్శంగా నిలిచాడు.
చదువు ఇలా కొనసాగింది..
అమీన్ తన ప్రాథమిక విద్యను ఒక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదివి ... ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నాడు. 12 వతరగతి వరకు ప్రభుత్వపాఠశాలలోనే చదివాడు. అమీన్ విజయం సాధించడంలోతన తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులు మాత్రమే కాకుండా, తన పాఠశాల ఉపాధ్యాయులు చిత్తరంజన్ జంగెలా సర్ ఎంతో కృషి చేశారని చెప్పారు. అమీన్ ఇండోర్ నుండి పట్టభద్రుడయ్యాడు. తన పాదాలతో కంప్యూటర్‌ను ఉపయోగించడం వంటి ఇతర ముఖ్యమైన పనులు చేస్తున్నాడు.
ప్రతికూల ఆలోచనలతో ఓడిపోవద్దని అమీన్ యువతకు విజ్ఞప్తి చేశారు. అతనికి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉండి సహాయం చేసిన తన చిన్న సోదరుడు ఆసిఫ్ మన్సూరితో కలిసి ఇండోర్‌కు వెళ్లాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత,..అమీన్ పోటీ పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించాడు. దేవుని దయతో అతను మొదటి ప్రయత్నంలోనే పట్వారీ పరీక్షలో విజయం సాధించాడు. తన కుమారుడి విజయాన్ని వివరించేందుకు అమీన్ తండ్రి ఇక్బాల్ మన్సూరికి మాటలు లేవు. తన కొడుకు ఎన్నో కష్టాలు పడ్డాడని, ఇప్పుడు దాని ఫలితాన్ని పొందుతున్నాడని చెప్పాడు.
రెండు చేతులు లేకపోయినా అధైర్య పడకుండా, నిరాశ పడకుండా తోటి వారితో కలిసి పరీక్ష రాయడానికి హాజరయ్యాడు. రెండు కాళ్ళతో పరీక్షరాసి తానేమి తక్కువ కాదని చాటి చెప్పాడు అమీద్ .
https://twitter.com/FreePressMP/status/1675813682272665600