
రౌడీ షీటర్ ... బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. ఆయనకు మధ్యంతర బెయిల్ పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఈ రోజు ( మార్చి 12) ఉదయం 6.30 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. హైకోర్టు హెచ్చరికలతో మీడియా ప్రతినిథుల కంట కనపడకుండా బోరుగడ్డ జైలుకు వచ్చారు.
బోరుగడ్డ అనికు కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ముగిసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యుల్ని దారుణంంగా తిట్టిన ఆరోపణలపై అరెస్టు అయిన బోరుగడ్డ అనిల్ కుమార్ ను గతంలో పోలీసులు రిమాండ్ పై రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని, సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని చెబుతూ ఈ నెల 1న మధ్యంతర బెయిల్ గడువును అనిల్ పొడిగించుకున్న విషయం తెలిసిందే.
బోరుగడ్డ అనిల్‌కుమార్ బెయిల్ గడువు ముగిసినా ఆయన సరెండర్ కాలేదని పోలీసులు హైకోర్టుకు సమాచారం ఇచ్చారు. తల్లికి సేవలు చేస్తూ చెన్నైలోనే ఉన్నారని ఆయన లాయర్ హైకోర్టుకు చెప్పుకొచ్చారు. అయితే హైకోర్టు సీరియస్ కావడంతో ఆయన ఉదయమే వచ్చి రాజమండ్రి జైల్లో లొంగిపోయారు. ఆయనపై పీటీ వారెంట్లు పెండింగ్ లో ఉండటంతో గుంటూరు పోలీసులు .. గుంటూరు తరలించారు.
వ్యవస్థలను సైతం ధిక్కరించేలా బోరుగడ్డ వ్యవహార శైలి ఉండటం సంచలనంగా మారింది. మధ్యంతర బెయిల్ కోసం తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారు. నకిలీ డాక్టర్ రిపోర్టులు ఇచ్చారు. అన్నీ బయటపడిన తర్వాత వీడియో రిలీజ్ చేసి బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు. కోర్టు ఇచ్చిన గడువులోపు లొంగిపోకుండా.. కొత్త నాటకాలు ఆడే ప్రయత్నం చేశారు. ఇలాంటి నాటకాలు ఆడిన బోరుగడ్డకు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోయాయి.
వైసీపీలో ఉన్నప్పుడు తాను మగోడ్నని చెప్పుకుని.. జగన్ ఊ అంటే అరగంటలో చంద్రబాబు, పవన్, లోకేష్‌లను చంపేస్తానని చెప్పేవాడు బోరుగడ్డ. చాలా మంది టీడీపీ నేతలకు ఫోన్లు చేసి బెదిరించేవాడు. ఈ మాటలే కాకుండా ఆయనపై అనేక దందాల ఆరోపణలు .. కేసులు ఉన్నాయి. ఓ సారి ఆయనను అప్పట్లో టీటీడీ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణదీక్షితులతో కలిసి ప్రెస్ మీట్లు పెట్టించేందుకు ఉపయోగించుకున్నారు. చివరికి ఆ రమణదీక్షితులు..ఈ బోరుగడ్డ అనిల్ ఇద్దరూ సమస్యల్లో చిక్కుకుపోయారు