మీ 90 గంటల పని వల్లే లంబోర్గిని కారు కొన్నా.. మరోటి కొంటా..

మీ 90 గంటల పని వల్లే లంబోర్గిని కారు కొన్నా.. మరోటి కొంటా..

వారానికి 90 రోజుల పని గంటల వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు.  L&T ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ‘‘భార్యను చూస్తూ ఎంతసేపు ఇంట్లో ఉంటారు.. ఆఫీసుకు వచ్చి పనిచేయండి. వారానికి 90 గంటలు పనిచేయడం మంచింది. ఆదివారాలు కూడా చేస్తే ఇంకా మంచిది’’ అని చేసిన కామెంట్స్ పై సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు సెటైర్లు, కామెంట్లు చేస్తునేఉన్నారు. 

తాజాగా ఈ వివాదంపై ప్రముఖ సెల్ఫ్ మేడ్ ఇన్వెస్టర్ విజయ కేడియా సెటైరికల్ ట్వీట్ చేశారు. వారానికి 90 గంటలు పనిచేయాలని వ్యంగ్యాస్త్రాలు విసురుతూనే.. దీని వలన ఎవరికి మేలు జరుగుతుందనేది చాలా సింపుల్ గా అర్థమయ్యేలా సెటైరికల్ ట్వీట్ చేశారు. 

‘ఈ రోజు ఆఫీసులో హృదయం ఉప్పొంగే సన్నివేశం జరిగింది. మా బాస్ లంబోర్గిని కారు కొన్నారు. కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వెళ్లాం. ఆ సందర్భంగా బాస్ చెప్పిన మాటలకు మేము చాలా ఇన్ స్పైర్ అయ్యాము. ‘‘ఈరోజు మనం సాధించినదానికి చాలా గర్వంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. మీరు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. మీరు తీరికలేకుండా 90  గంటలు పని చేయడం వలన నేను లంబోర్గిని కారు కొనగలిగాను. మీరు ఎలాగే పనిచేస్తూ పోతే.. వచ్చే ఏడాది మరో లంబోర్గిని కొంటాను’’అని విజయ్ కేడియా సెటైరికల్ ట్వీట్ చేశారు. 

L&T ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై జరుగుతున్న చర్చ ఇప్పట్లో ఆగేలా లేదు. సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు వరుసగా కామెంట్స్ చేస్తుండంతో పెద్ద ఇష్యూలా మారేలా కనిపిస్తోంది.