
హైదరాబాద్, వెలుగు: ఎడ్యుటెక్ ఫ్లాట్ఫారమ్ఫ్రీడమ్ యాప్‌ను కొనుగోలు చేసినట్టు బాస్వాలా ప్రకటించింది. వ్యాపారవేత్త శశి రెడ్డి బాస్వాలాను స్థాపించారు. సువిజన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రీడమ్‌ను నిర్వహిస్తోంది. దీని కొనుగోలు కోసం బాస్ వాలా ఏడు మిలియన్ డాలర్లు (సుమారు 60 కోట్లు) పెట్టుబడి పెట్టింది.
ఈ సందర్భంగా శశి రెడ్డి మాట్లాడుతూ ఈ ఫ్రీడం యాప్ ద్వారా ఉపాధి ఆధారిత ఎడ్యుకేషన్ కంటెంట్లభిస్తుందని, వివిధ వ్యాపార రంగాలకు చెందిన వేల మంది నిపుణుల సేవలను అందుబాటులోకి తెస్తుందన్నారు. టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వ్యక్తులకు అవసరమైన వనరులు అందిస్తుందని, వ్యాపారంలో ఎదగడానికి సహాయపడుతుందని రెడ్డి తెలిపారు.