సీఎంను కలిసిన బోథ్ ​కాంగ్రెస్​ నేతలు

బోథ్, వెలుగు: మండలానికి చెందిన కాంగ్రెస్​నాయకులు శుక్రవారం హైదరాబాద్​లో సీఎం రేవంత్​రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జ్ఞాపిక అందజేసి సన్మానించారు. బోథ్​మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్​చేయాలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఫైర్​స్టేషన్​ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఎంపీటీసీ మహేందర్, నాయకులు మెరుగు భోజన్న, బారె నాగేందర్, ఆడెపు కిరణ్, రోజా సాయన్న ఉన్నారు.