బీజేపీలో చేరిన బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు

బీఆర్ఎస్ కు ఇటీవల రాజీనామా చేసిన  బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు  బీజేపీలో చేరారు.  ఢిల్లీలో బాపురావుకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ చీఫ్ కిషన్‌రెడ్డి.  2018 ఎన్నికల్లో  బోథ్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన  రాథోడ్‌ బాపురావుకు ఈ సారి  బీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది.   దీంతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు.  బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన  ఆయన  కొద్ది సేపటి క్రితమే  బీజేపీలో చేరారు.