ఎస్పీలోకి మరో ఇద్దరు హస్తం నేతలు జంప్

ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. హస్తం పార్టీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఒక్కొక్కరు జంప్ అవుతున్నారు. సమాజ్ వాదీ పార్టీలోకి  మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు జాయిన్ అయ్యారు. బరేలికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రవీణ్ సింగ్, మరో సీనియర్ నేత, బరేలి మాజీ మేయర్ సుప్రియా అరోన్ అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్ వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇద్దరు నేతలను అఖిలేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వనించి పార్టీ కండువా కప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని వలసలు ఉంటాయని ఎస్పీ చీఫ్ చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

 

సమాజ్ వాదీ పార్టీలోకి అత్యంత పొడుగైన వ్యక్తి

ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు రీహార్సల్స్