హసన్‌పర్తి, వెలుగు : ఫార్మసీ విభాగంలో డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేసి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించాలని బీఎస్‌ఎఫ్ కేయూ ఇన్‌చార్జ్, జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ డిమాండ్ చేశారు. శనివారం ఎస్‌ఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలతో కలిసి యూనివర్సిటీ వీసీ బిల్డింగ్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఫార్మసీలో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించకపోవడం వల్ల స్టూడెంట్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్, ఎస్‌ఎస్‌యూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరు సాయికుమార్, బీఎస్‌ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్షుడు మచ్చ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.