చంద్రబాబును దేవుడు కూడా క్షమించడు... ఈసీ కూటమికి లొంగిపోయింది.. బొత్స సత్యనారాయణ

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో పలు పథకాలకు నిధుల విడుదల అంశంలో ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య రచ్చ నెలకొంది. ఈ అంశం మీద మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించాడు. ఎన్నికల సంఘం కూటమికి లొంగిపోయిందని, చంద్రబాబు కుట్రలకు వంత పడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న బొత్స ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పసుపు కుంకుమ ఇచ్చినప్పుడు ఈ నిబంధనలు అడ్ఢరాలేదా అని ప్రశ్నించారు బొత్స.

పేదవాడికి నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లకుండా కూటమి కుట్ర చేస్తోందని అన్నారు బొత్స. పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే ఒక్క పేదవాడైనా రాష్ట్రంలో బతకగలడా అని ప్రశ్నించారు బొత్స. చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని అన్నారు. కడుపు అన్నం తినేవాడు ఎవడైనా మీ భూమి మీది కాదంటూ ప్రకటనలు ఇస్తాడా అని ప్రశ్నించారు బొత్స. ఎన్నికల కమిషన్ దీనికి ఏం సంధానం ఇస్తుందని అన్నారు మంత్రి బొత్స.