విశాఖ ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఎల్లుండి ( ఆగస్టు16) రిటర్నింగ్​ అధికారి  అధికారికంగా ప్రకటించనున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్​ దాఖలు చేసిన షఫి తన నామినేషన్​ ను ఉపసంహరిచుకున్నారు. 

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన షఫీ తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో బొత్స సత్యనారాయణ  నామినేషన్ ఒక్కటే మిగిలింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి కూడా బరిలోకి దిగకకపోవడంతో ఇద్దరు మాత్రమే బరిలో నిలిచారు. తన నామినేషన్ ను... ఈరోజు ( ఆగస్టు 14)  నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తి కానున్న సమయంలో స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఒక్కరే అభ్యర్థిగా మిగిలారు. దీంతో అధికారులు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎల్లుండి ( ఆగస్టు 16) ఎన్నికల రిటర్నింగ్​ అధికారి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు.

 కూటమి పార్టీలు పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణయించడంతో వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక ఏక‌గ్రీవం అయ్యింది. నిన్నటి వ‌ర‌కు ప‌లు ర‌కాలుగా క‌స‌ర‌త్తులు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, చివ‌రికి పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణయానికి వ‌చ్చేశారు. నామినేష‌న్ చివ‌రి రోజున ఈ పోటీకి దూరంగా ఉండాల‌ని నిర్ణయం తీసుకోవ‌డంతో బొత్స గెలుపు ఖ‌రారైంది. బొత్సాతోపాటు ఒకే ఒక్క నామినేష‌న్ దాఖ‌లైంది. షేక్ ష‌ఫీ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆయ‌న‌ నామినేష‌న్ ఉప సంహ‌రించుకోవడంతో  గెలుపు ఏక‌గ్రీవం అయింది

విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఆచితూచి వ్యవ‌హరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా నాయ‌కులంద‌రితో సంప్రదించి బొత్స పేరును ఖ‌రారు చేశారు. కానీ కూట‌మి మాత్రం మొద‌టి నుంచీ పోటీ చేయాలా వ‌ద్దా అనే విష‌యంపై త‌ర్జన భ‌ర్జన‌లు ప‌డింది. 

బ‌లం లేద‌నే వెన‌క‌డుగు..

విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపి మొత్తం 838 ఓట్లున్నాయి. వాటిలో 636 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు 36 మంది, కార్పొరేటర్లు 97 మంది, కౌన్సిలర్లు 53 మంది, మరో 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. వైసీపీ నుంచి ఎక్స్ ఆఫీషియో కింద ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో టీడీపీకి 200కుపైగా ఓట్లున్నాయి. వైసీపీకి 543కుపైగా ఓట్లు ఉన్నట్లు ఆయా పార్టీలు లెక్కలేసుకున్నాయి. బ‌లం లేకుండా పోటీ చేసి ఓటమి పాలైతే అన‌వ‌స‌రంగా వైసీపీకి మైలేజ్ ఇచ్చిన‌ట్టవుతుంద‌ని కొంద‌రు వారించారు. కొంత‌మంది మాత్రం పోటీ చేస్తే గెల‌వొచ్చని చంద్రబాబుకి స‌ల‌హా ఇచ్చారు.

 వైఎస్ జ‌గ‌న్ పలుమార్లు ఎంపీటీసీలు, జెడ్పీటీడీసీల‌తో స‌మావేశం నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధుల‌తో  స‌మావేశం అయ్యారు.   గ్రేట‌ర్ విశాఖ స్థాయీ సంఘం ఎన్నిక‌ల్లో పరాజ‌యం త‌ర్వాత వైసీపీ అలెర్ట్ అయ్యింది. ఈ ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న చంద్రబాబు, పోటీ చేయ‌క‌పోవ‌డ‌మే బెట‌ర‌నే నిర్ణయానికి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. బ‌లం లేకుండా పోటీ చేసిన‌ప్పుడు ఫలితం ఎలా వచ్చినా న‌ష్టమ‌ని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు..