మొత్తానికి దొరికాడు : డ్రంక్ అండ్ డ్రైవ్ లో.. మెషీన్ తో పారిపోయిన మందుబాబు అరెస్ట్

మొత్తానికి దొరికాడు : డ్రంక్ అండ్ డ్రైవ్ లో.. మెషీన్ తో పారిపోయిన మందుబాబు అరెస్ట్

ఎట్టకేలకు ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ మెషిన్‌తో పారిపోయిన నిందితుడిని బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బ్రీత్ అనలైజర్ తో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కరీంనగర్ జిల్లా  రామగుండానికి చెందిన  కొత్తపల్లి శ్రావణ్ గా గుర్తించారు .

జూన్ 27న  బోయిన్ పల్లి  ట్రాఫిక్ పోలీసులు పుల్లారెడ్డి బిల్డింగ్, ట్రాఫిక్ పాయింట్, న్యూ బోవెన్‌పల్లి  దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు  5  గంటల సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఒక స్విఫ్ట్ డిజైర్ కారును ఆపిపోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తుండగా బ్రీత్ ఎనలైజర్ మిషన్ ను  పట్టుకుని పారిపోయాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు కోసం బ్రీత్ అనలైజర్ మిషన్ ను  అతని నోట్లో పెట్టగా దానిని పట్టుకుని  క్షణాల్లో పరారయ్యాడు మందుబాబు. 

 దీంతో పోలీసులు ఒక్కసారిగి షాకయ్యారు.  అతని ఛేజ్ చేయడానికి ట్రై చేసిన ఫలితం లేకుండా పోయింది.    దీంతో ట్రాఫిక్ పోలీసులు చేసేది ఏమీలేక  బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఆ మందుబాబును పట్టుకున్నారు.  డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసిన పోలీసులకే మస్కా కొట్టి పారిపోయిన ఈ మందుబాబు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే  ప్రజలు డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో  పోలీసు అధికారులకు  సహకరించాలని  పోలీసులు కోరారు.