ఆసిఫాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని సీఎం కేసీఆర్ కూతురు కవిత తెలంగాణకు తలవంపులు తెచ్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. అవినీతి నిర్మూలన చేస్తానంటూ ఢిల్లీ సీఎం పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్‌తో నోరు మెదపని స్థితికి వచ్చారని మండిపడ్డారు. భట్టి నిర్వహిస్తున్న ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర 12 వరోజు(సోమవారం) ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కైర్ గాం నుంచి మంచిర్యాల జిల్లా రేపల్లె వాడకు చేరుకుంది.
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వనరులను ఆంధ్రా కంపెనీలకు కేసీఆర్ ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వాల్సిన బొగ్గు గనుల కాంట్రాక్టులను.. ఆంధ్రా బడా బాబుల కంపెనీలకు కట్టబెడుతున్నారని ఫైర్ అయ్యారు.