బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని కుంట రాములు బస్తీలో ముర్కూరి చంద్రయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్‌ను అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణి కుంట్ల ప్రవీణ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రికెట్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఎంతో క్రేజ్ ఉందని, బెల్లంపల్లి పట్టణం క్రీడాకారులకు పుట్టినిల్లు అన్నారు.
యువతలో క్రికెట్ ను ప్రోత్సహించేందుకు, హైదరాబాద్ స్థాయిలో బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్, పలువురు నేతలు, క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.