తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు బాక్సర్ నిఖత్ జరీన్. ప్రతిభను గుర్తించి తనకు డీఎస్పీ పోస్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. స్పోర్ట్స్ ప్లేయర్ని ఎంకరేజ్ చేస్తే తనలా మరింతమంది ముందుకు వస్తారని అన్నారు. త్వరలోనే డీఎస్పీ ట్రైనింగ్ తీసుకుంటానని చెప్పారు. డీజీపీ జితేందర్ రెడ్డికి సమాచారం ఇస్తానని చెప్పారు.
ALSO READ | సీఎం రిలీఫ్ ఫండ్కు బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటి విరాళం
పారిస్ ఒలంపిక్ లో ఓడిపోయినందుకు చాలా బాధనిపించిందన్నారు నిఖత్ జరీన్. వచ్చే ఒలంపిక్ లోనైనా ఖచ్చితంగా మెడల్ సాధిస్తానని చెప్పారు. తన డ్రీమ్ ఒలంపిక్ లో గోల్డ్ మెడల్ సాధించడమేనని చెప్పారు. తెలంగాణలో బాక్సింగ్ అకాడమీ లేకపోవడం బాధాకరమన్నారు. సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లా.. బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని సహాయ సహకారాలు అందిస్తుందన్నారు నిఖత్ జరీన్.