బాక్సర్ నిఖత్ జరీన్కు డీఎస్పీ ఉద్యోగం..నియామక పత్రాలు అందజేత

బాక్సర్ నిఖత్ జరీన్కు డీఎస్పీ ఉద్యోగం..నియామక పత్రాలు అందజేత

హైదరాబాద్: బాక్సర్ నిఖత్ జరీన్ డీఎస్పీగా నియమితులయ్యారు. ప్రపంచ మహిళా బాక్సింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్ కు జూబ్లీహిల్స్ లో 600 గజాల ఇంటి స్థలం, డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. బుధవారం( సెప్టెంబర్18న) బాక్సర్ నిఖత్ జరీన్ కు డీఎస్పీగా ఉద్యోగం కల్పిస్తూ డీజీపీ జితేందర్రెడ్డి అందజేశారు. 

నిఖత్ జరీన్ తోపాటు క్రీడాకారులు ఈషా సింగ్, భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ లకు కూడా 600 గజాల ఇంటి స్థలం, నిఖత్ జరీన్, సిరాజ్ లకు గ్రూప్ 1 స్థాయి (డీఎస్పీ ) ఉద్యోగాలిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.