నిషాంత్‌‌‌‌కూ నిరాశే..క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఓడిన బాక్సర్

నిషాంత్‌‌‌‌కూ నిరాశే..క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఓడిన బాక్సర్

పారిస్‌‌‌‌ : ఒలింపిక్స్‌‌‌‌లో షూటర్లు తప్ప మిగతా వాళ్లు పతకం అందుకోలేకపోతున్నారు. బాక్సింగ్‌‌‌‌లో ఆశలు రేపిన 23 ఏండ్ల  నిషాంత్‌‌‌‌ దేవ్ పతక పంచ్‌‌‌‌ కొట్టలేకపోయాడు. శనివారం రాత్రి జరిగిన మెన్స్‌‌‌‌ 71 కేజీ క్వార్టర్ ఫైనల్లో నిషాంత్  1–4తో మెక్సికోకు చెందిన మార్కో  అలోన్సో చేతిలో పోరాడి ఓడిపోయాడు. తొలి రౌండ్‌‌‌‌లో దేవ్‌‌‌‌  స్పష్టమైన పంచ్‌‌‌‌లతో సత్తా చాటాడు. దాంతో ఐదుగురు జడ్జీల్లో నలుగురు అతనికి  ఓటేశారు.

కానీ, ఇదే జోరును కొనసాగించలేకపోయిన ఇండియా బాక్సర్‌‌‌‌ ‌‌‌‌తర్వాత తడబడ్డాడు. హోరాహోరీగా సాగిన రెండో రౌండ్‌‌‌‌లో మార్కో పైచేయి సాధించాడు. అతనికి ముగ్గురు బాక్సర్లు ఓటు వేశారు.  చివరి రౌండ్‌‌‌‌లోనూ ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు పోటీ పడగా..

చివర్లో  చెలరేగిన మార్కో పతక పంచ్‌‌‌‌లు విసిరారు. దాంతో నిశాంత్‌‌‌‌కు నిరాశ తప్పలేదు. తను సెమీస్ చేరితే కనీసం కాంస్య పతకం ఖాయం అయ్యేది. నిషాంత్ వెనుదిరగడంతో బాక్సింగ్‌‌‌‌లో ఇండియా నుంచి లవ్లీనా బొర్గొహైన్ మాత్రమే పోటీలో నిలిచింది.