హైదరాబాద్: గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉందని బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ అన్నారు. బంగారు పతకం సాధించిన తర్వాత తొలిసారి ఆమె హైదరాబాద్ కు వచ్చారు. తనను ప్రోత్సహించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీనా కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. జరీనాకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో అనేక మంది ఆణిముత్యాలు ఉన్నారని.. వారందరిని వెలికి తీసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. నిఖత్ జరీన్ మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
మరిన్ని వార్తల కోసం...
మోడీ వస్తుండని ఏడికి పారిపోయినవు కేసీఆర్?
డ్రోన్ రంగంలో భారీగా ఉపాధి అవకాశాలు