భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంత ప్రధాకరమైన బౌలరో అందరికి విదితమే. బుమ్రా సంధించే వేగాన్ని పక్కనపెడితే.. అతను యాక్షన్ ముందుగా బ్యాటర్లను భయపెడుతుంది. అలా ఉంటది బుమ్రా బంతిని సంధించే విధానం. బుమ్రాను ఎదుర్కోవడం కష్టమని.. బుమ్రా అత్యంత కఠిన బౌలర్ అని అగ్రశ్రేణి క్రికెటర్లు సైతం పొగడ్తలు కురిపిస్తున్న రోజులివి. ఇటువంటి కాలంలో ఓ 19 ఏళ్ళ కుర్ర బ్యాటర్ బుమ్రాపై పోటీకి సై అంటే సై అంటున్నాడు.
చివరి రెండు టెస్టులకు మెక్‌స్వీనే స్థానంలో జట్టులోకి వచ్చిన సామ్ కొంటాస్.. భారత పేసర్‌ను ఎదుర్కోవడానికి తన వద్ద ప్రత్యేక వ్యూహాలు ఉన్నట్లు వెల్లడించాడు. కానీ, అవేంటనేది బయటకు చెప్పనని మాట దాటేశాడు. బుమ్రాతో ఆసక్తికర సమరం కోసం తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
"ప్రపంచంలోని అత్యంత విధ్వంసక ఫాస్ట్ బౌలర్ బుమ్రా అని నాకూ తెలుసు. కానీ, బుమ్రా కోసం నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. అదేంటి అనేది నేను బయట పెట్టను. బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను.." అని కొంటాస్ టెస్ట్ అరంగేట్రానికి ముందు విలేకరులతో అన్నారు .
ఎవరీ సామ్ కొంటాస్..?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరగనున్న తుది రెండు టెస్టులకు ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో ఈ 19 ఏళ్ల యువ బ్యాటర్ చోటు దక్కించుకున్నాడు. తద్వారా సుమారు 70 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో చోటు దక్కించుకున్న ఆస్ట్రేలియా ప్లేయర్‌గా కొంటాస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. మెల్‌బోర్న్, సిడ్నీల్లో జరిగే టెస్టుల్లో అతను బరిలోకి అవకాశాలు ఉన్నాయి.
Also Read :- సొంతగడ్డపై సఫారీల తడబాటు.. పాకిస్థాన్ సరికొత్త చరిత్ర
న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడుతున్న కొంటాస్.. షెఫీల్డ్ షీల్డ్ సిరీస్ లో వరుస సెంచరీలు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అనంతరం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఇండియా- ఏతో జరిగిన మ్యాచ్ లో 73 పరుగులు చేసి ఔరా చేశాడు. ఆపై కాన్‌బెర్రాలో భారత్‌తో జరిగిన ప్రైమ్ మినిస్టర్స్ XI పింక్-బాల్ మ్యాచ్‌లో సెంచరీ (107) చేసి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
'Bowled, Bumrah'
— Louis Cameron (@LouisDBCameron) December 23, 2024
Sam Konstas certainly feels like a new breed of Australian cricketer. This Joe Root-style ramp was a bit of an outlier in an otherwise watchful hit. But don't expect him to die wondering if he takes on India on Boxing Day #AUSvIND pic.twitter.com/SSPkRfE4cP