
కోస్టా నవరినో (గ్రీస్): లాస్ ఏంజిల్స్–2028 ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ను తిరిగి అధికారికంగా చేర్చారు. గురువారం జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పాలకమండలి సమావేశంలో సభ్య దేశాలు ఏకగ్రీవంగా దీనికి ఆమోదం తెలిపాయి. ఈ సమావేశంలో ఐఓసీ నూతన ప్రెసిడెంట్‌గా జింబాబ్వే మాజీ స్విమ్మర్ కిర్‌స్టీ కోవెంట్రీ ఎన్నికైంది. 11 ఏండ్లు ఈ పదవిలో ఉన్న థామస్ బాచ్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనుంది.
మాజీ డబుల్ ఒలింపిక్ చాంపియన్ అయిన కోవెంట్రీ ఐఓసీ తొలి మహిళా అధ్యక్షురాలు కానుంది. ఐఓసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టున్న తొలి ఆఫ్రికన్‌గా రికార్డు సృష్టించింది.2030 కామన్వెల్త్ గేమ్స్‌కు ఇండియా బిడ్గుజరాత్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించేందుకు ఇండియా బిడ్ వేసింది. ఇప్పటికే ఆసక్తి లేఖను పంపించిన ఐఓఏ ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు గుజరాత్ ప్రభుత్వంతో కలిసి, బిడ్ దాఖలు చేసిందని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.