
హైదరాబాద్, వెలుగు: దేశంలో ప్రొఫెషనల్ బాక్సింగ్‌ను ప్రోత్సహించేందుకు ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్ (ఐపీబీఎల్), ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ) టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటికి చెందిన సౌత్‌బేతో కలిసి ‘బాక్సింగ్‌బే ఫైట్ నైట్స్’ టూర్‌ను ప్రకటించాయి. ఇందులో తొలి టూర్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 29, మార్చి 7, 14, 28 తేదీల్లో నగరంలో ఫైట్ నైట్స్ జరుగుతాయి. వరల్డ్ వైడ్‌గా ఉన్న 20 మంది ప్రొఫెషనల్ బాక్సర్లు ఇందులో బరిలో దిగుతారు.