ప్రాణం మీదకు తెచ్చిన పతంగి..బిల్డింగ్​పై నుంచి కిందపడి గాయపడిన బాలుడు

  • ఆదిలాబాద్​ జిల్లా ఇన్కర్‌‌ గూడలో ఘటన

గుడిహత్నూర్, వెలుగు: పండగ పూట పతంగి బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆదిలాబాద్​జిల్లా గుడిహత్నూర్‌‌ మండలం ఇన్కర్‌‌గూడకు చెందిన జాడి మురళి, విజిత దంపతుల కొడుకు వినయ్‌‌(9) కొల్హారీ ప్రభుత్వ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి రోజు  ఫ్రెండ్స్ తో కలిసి పక్కింటి డాబాపై  పతంగి ఎగురవేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్‌‌ కు తరలించారు. కోమాలోకి వెళ్లిన బాలుడి పరిస్థితి విషమంగా ఉందని రిమ్స్‌‌ డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌‌ తరలించాలని సూచించారు.