హుజూర్ నగర్, వెలుగు: తీసివేతలు రావట్లేదని సూర్యాపేట జిల్లాలో ఓ బాలుడిని గవర్నమెంట్స్కూల్టీచర్చితకబాదాడు. ఒళ్లంతా కందిపోయేలా కొట్టాడు. బాధిత తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్మండలం బూరుగడ్డకు చెందిన మెరిగ వీరబాబు, స్వాతి దంపతుల కొడుకు ప్రేమ్ కుమార్ స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. శనివారం బాలుడికి తీసివేతలు రావట్లేదని ఆగ్రహంతో ఊగిపోయిన హెచ్ఎం జి.కాంతయ్య కర్రతో వీపు కందిపోయేలా కొట్టాడు.
నొప్పి భరించలేకపోయిన ప్రేమ్ కుమార్ ఏడుస్తూ ఇంటికి వెళ్లాడు. టీచర్కొట్టిన విషయం తల్లితో చెప్పాడు. సదరు టీచర్గతంలోనూ అకారణంగా పిల్లలను కొట్టేవాడని గ్రామస్తులు ఆరోపించారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని వాపోయారు. ఈ ఘటనపై ఎంఈఓ సైదానాయక్ ను సంప్రదించగా సోమవారం స్కూల్‌ను సందర్శించి, విచారణ జరుపుతామని తెలిపారు.