గుండెపోటుతో బాలుడు మృతి

  •       అనారోగ్యంతో ఉంటే తిరుపతికి 
  •        తీసుకెళ్లిన తల్లిదండ్రులు
  •         వచ్చేసరికి తీవ్ర అస్వస్థత

జగిత్యాల రూరల్, వెలుగు: మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేండ్ల పిల్లవాడు గుండెపోటుతో చనిపోయాడు. జగిత్యాల జిల్లా అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన గంగాధర్, -హరిత దంపతులకు ఇద్దరు కొడుకులు. గంగాధర్ కుటుంబం మూడు రోజుల కింద తిరుపతి వెళ్లారు. అప్పటికే వీరి రెండో కొడుకు హర్షిత్​ అస్వస్థతకు గురయ్యాడు. బుధవారం అర్ధరాత్రి ఇంటికి చేరుకునే సరికి మరింత అనారోగ్యానికి గురయ్యాడు. వాంతులు చేసుకున్నాడు. వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. గుండెపోటు వల్లే చనిపోయాడని ధ్రువీకరించారని చెబుతున్నారు.