ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు.. మురికిగుంటలో శవమై తేలాడు

కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో పండుగ పూట విషాధం నెలకొంది. ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు మురుగు కాల్వలో పడి మృతిచెందాడు.
సాయి సద్గురు కాలనీకి చెందిన ఆరేండ్ల నిశాంత్ గురువారం ఆడుకోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి మాత్రం రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆయా ప్రాంతాల్లో వెతికారు. బాలుడు ఎక్కడా కనిపించకపోవడంతో తల్లిదండ్రలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా కూడా బాలుడి కోసం కుటంబసభ్యులు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వెతుకుతుండగా.. ఇంటికి సమీపంలోని మురుగు నీటి కాలువలో శవమై కనిపించాడు. పండుగ పూట కొడుకు మృతితో తల్లిదండ్రులు తీవ్ర కన్నీటిపర్యంతమయ్యారు. పండగపూట కాలనీలో బాలుడు చనిపోవడంతో కాలనీ అంతా విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

బయటకే సెలూన్.. లోపల మాత్రం వేరే యవ్వారం

పిల్లల్ని స్కూల్‌కు పంపాలనుకుంటున్నారా? అయితే ఈ పేపర్‌పై సంతకం చేయాల్సిందే

నీట్ పీజీ 2021 షెడ్యూల్ విడుదల