పెద్దపల్లి జిల్లాలో తాత ట్రాక్టర్ కింద పడి మనవడు మృతి

పెద్దపల్లి జిల్లాలో తాత ట్రాక్టర్ కింద పడి మనవడు మృతి

ధర్మారం, వెలుగు:  తాత ట్రాక్టర్​ రివర్స్​ తీస్తుండగా దాని కింద పడి మనవడు చనిపోయాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన మ్యాన ప్రభాకర్‌‌ మనవడు మ్యాన వేదాన్ష్‌(4). ప్రభాకర్‌‌ గురువారం పొలానికి వెళ్లి ఇంటికి వచ్చాడు.

తాత వచ్చాడని పరిగెత్తుకు వెళ్లిన వేదాన్ష్​ను ప్రభాకర్​ గమనించలేదు. ట్రాక్టర్​ రివర్స్​ తీస్తుండగా వెనక టైర్​ కింద పడి  తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. వేదాన్ష్​ తండ్రి ఓంకార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.