ఐదో అంతస్తు నుంచి పడి బాలుడు మృతి

ఐదో అంతస్తు నుంచి పడి బాలుడు మృతి

సికింద్రాబాద్, వెలుగు : తోటి పిల్లలతో ఆడుకుంటూ ఓ బాలుడు ఐదో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. కుషాయిగూడలోని మాప్లే హోమ్స్​లో నివాసముండే మన్నవత్ సీతారామ్​కు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు ఆర్యన్​(9) ఈ నెల 29న స్కూల్​కు సెలవు కావడంతో తన స్నేహితులతో ఆడుకునేందుకు ఇంటి పక్కనే ఉన్న అపార్ట్​మెంట్​కు వెళ్లాడు.

అక్కడి​ఐదో అంతస్తులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు హుటాహుటిన బాలుడిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.