
గద్వాల, వెలుగు: ప్రమాదవశాత్తు హార్వెస్టర్‌లో పడి బాలుడు చనిపోయిన ఘటన గద్వాల జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లిలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన రాజు, అఖిల దంపతులకు కొడుకు జీవన్ (8), కూతురు ఉన్నారు. రాజు తన పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు. గురువారం హార్వెస్టర్‌తో మొక్కజొన్న కోస్తున్నారు. రాజు పక్కనే పనులు చేసుకుంటుండగా.. జీవన్ ఆడుకుంటూ హార్వెస్టర్ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో మెషీన్ ఒక్కసారిగా బాలుడిని లాగేయడంతో బాడీ నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే చనిపోయాడు.