గండీడ్, వెలుగు: ఇతరులలో తమ కొడుకుని చూసుకోవచ్చని భావించిన తల్లిదండ్రులు బ్రెయిన్‌డెడ్ అయిన బాలుడి అవయవాలు దానం చేశారు. వివరాల్లోకెళితే.. మహమ్మదాబాద్ మండలం మంగంపేట్ తండాకు చెందిన హన్మంతు రాథోడ్ పోలీస్ కానిస్టేబుల్. ఉద్యోగరీత్యా కుటుంబంతో శంషాబాద్ లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు అర్జున్ రాథోడ్(12) ఆరో తరగతి పూర్తి చేశాడు.
ఈ నెల 1న నీళ్ల కోసం స్కూటీపై వెళ్లగా, ట్రాక్టరు ఢీకొట్టింది. దీంతో అతడికి శంషాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధారించారు. తమ కుమారుడు లేడన్న బాధను దిగమింగి, కొడుకు అవయవాలను దానం చేసేందుకు ముందుకువచ్చారు. అర్జున్ అవయవాలను సేకరించి అవసరమైన వారికి అందజేశారు.