బొంరాస్‌‌పేట మండలంలో కరెంట్​ షాక్‌‌తో బాలుడు మృతి..తల్లికి తీవ్ర గాయాలు 

 బొంరాస్‌‌పేట మండలంలో కరెంట్​ షాక్‌‌తో బాలుడు మృతి..తల్లికి తీవ్ర గాయాలు 

కొడంగల్, వెలుగు: వికారాబాద్​ జిల్లా బొంరాస్‌‌పేట మండలంలో కరెంట్ షాక్‌‌తో బాలుడు చనిపోయాడు.  ఆదివారం బడికి సెలవు కావడంతో తండ్రి బసంతప్ప, తల్లి గౌరమ్మ తమ కొడుకు మణితేజ (9)ను ఎద్దులకు నీళ్లు తాగించేందుకు గ్రామంలో నీటి తొట్టె వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఈదురు గాలులు వీయడంతో  నీటి తొట్టె పక్కనే ఉన్న చెట్టు విరిగి కొమ్మలు కరెంట్​ వైర్లపై పడ్డాయి. అక్కడే ఉన్న మణితేజ, గౌరమ్మపై కరెంట్ వైర్లు పడటంతో వారికి షాక్ తగిలింది. మణితేజ అక్కడికక్కడే చనిపోగా,   గౌరమ్మ తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను కొడంగల్​ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బొంరాస్ పేట ఎస్‌‌ఐ రవూఫ్​ తెలిపారు.