స్విమ్మింగ్ పూల్ లో పడి రెండోవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో నాగిరెడ్డి గూడ గ్రామ రెవెన్యూలో గాల సుజాత స్కూల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గాల సుజాత స్కూల్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో సమ్మర్ క్యాంపు అంటూ స్విమ్మింగ్ ట్రైన్నింగ్ ఇస్తున్నారు. ఈక్రమంలో మే 10వ తేదీ శుక్రవారం స్విమ్మింగ్ ట్రైన్నింగ్ తీసుకుంటూ బాలుడు ప్రమాదవశాత్తు మరణించాడు.
ఈ విషయం బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం ప్రయత్నం చేసింది. విషయం తెలుసుకున్న పలవురు విద్యార్థుల తల్లిదండ్రులు.. స్కూల్ పీఈటీలకు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన విద్యార్థిని మొయినబాద్ మండలంలోని సురంగల్ గ్రామానికి చెందిన గాండ్ల శివశౌర్య(7)గా గుర్తించారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.