వరంగల్ జిల్లా పిన్నవారివీధిలో విషాదం చోటు చేసుకుంది. చాక్లెట్ గొంతులో ఇరుక్కొని ఎనిమిదేళ్ల సందీప్ అనే బాలుడు చనిపోయాడు. తండ్రి కందన్ సింగ్ ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన చాక్లెట్ ను సందీప్ స్కూల్ కు తీసుకెళ్లి తిన్నాడు. చాక్లెట్ తిన్నాక కొద్దిసేపటికీ ఊపిరాడక కుప్పకూలాడు. దీంతో స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.
చాక్లెట్ గొంతులో ఇరుక్కుపోవడం వల్లే ఊపిరాడక మరణించాడని డాక్టర్లు తెలిపారు. కన్‌గహాన్‌సింగ్‌కు భార్య గీత, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరు పిన్నావారివీధిలోని శారదా పబ్లిక్‌స్కూల్‌లో చదువుతున్నారు. శనివారం సాయంత్రం రైల్వేగేటు ప్రాంతంలోని శ్మశానవాటిక లో కుటుంబ సభ్యులు బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు.