
మెదక్ (అల్లాదుర్గం), వెలుగు : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద 161 నేషనల్హైవేపై ఓ బాలుడి తల రెయిలింగ్లో ఇరుక్కోపోయింది. ఐబీ చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్ కింద ఫుట్ పాత్పై ఐరన్ రెయిలింగ్ నిర్మించారు. బస్ స్టాప్ లేకపోవడంతో ప్రయాణికులు ఫ్లైఓవర్ కింద ఫుట్ పాత్ పై బస్ కోసం ఎదురుచూస్తారు. శుక్రవారం ఉదయం కొందరు ప్రయాణికులు హైదరాబాద్ వైపు వెళ్లడానికి బ్రిడ్జి కింద కూర్చున్నారు.
రెండేండ్ల బాలుడు హైవే రోడ్డుకు, ఫుట్పాత్కు మధ్యలో ఉన్న రెయిలింగ్వద్ద ఆడుకుంటుండగా తల రాడ్ల మధ్యలో ఇరుక్కుపోయింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తల బయటకు రాలేదు. దీంతో రెండుగంటల పాటు నరకయాతన అనుభవించాడు. చివరకు అటువైపు వెళ్తున్న కొందరు గంట పాటు శ్రమించి రాడ్ కట్ చేసి బయటకు తీశారు.