
పోరగాళ్లు ఉన్నతాట ఉండరు.. ఒక్క నిమిషం వాళ్లను గమనించడం మానేస్తే ప్రాణాల మీదకు తెస్తారు. లేటెస్ట్ గా మెదక్ జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఇనుప కంచె మధ్యలో తలపెట్టడంతో ఇరుక్కుపోయింది. దీంతో రెండు గంటల పాటు బాలుడు నరకయాతన అనుభవించాడు.
మెదక్ జిల్లా అల్లాదుర్గా ప్లైఓవర్ ఎన్ హెచ్ 161రోడ్డు పై ఇనుపంచె ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఇనుప కంచె మధ్యలో తల పెట్టాడు. తల మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో బాలుడి ఏడవడంతో స్థానికులు వచ్చారు. బాలుడి తల బయటకు తీసేందుకు బాగా ప్రయత్నించారు. అయినా తల రాలేదు. రెండు గంటల పాటు బాలుడు నరకయాతన అనుభవించాడు. తల బయటకు రాకపోవడంతో రాడ్ కట్ చేసి తలను బయటకు తీశారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. రెండు గంటల పాటు జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.