
పాలకుర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో వడ దెబ్బతో ఓ బాలుడు చనిపోయాడు. మండల కేంద్రానికి చెందిన గాదెపాక రేణుక, శోభన్ బాబు దంపతుల కొడుకు విక్రమ్ (12 ) జనగామ జిల్లా లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాలకుర్తిలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం ఇంటికి వచ్చాడు. తర్వాత వాంతులు, మోషన్స్ కావడంతో అతడి పేరెంట్స్ స్థానిక ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆదివారం ఉదయం చనిపోయాడు.