ఆలయ గుండంలో పడి బాలుడు మృతి

ఆలయ గుండంలో పడి బాలుడు మృతి

జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట పీఎస్​పరిధిలోని మహదేవపురం శివాలయం గుండంలో పడి గుర్తుతెలియని బాలుడు(14) చనిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం ఆలయ గుండం వద్ద బాలుడి బట్టలు కనిపించాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు గజఈతగాళ్ల సాయంతో వెతికారు. రాత్రయినా ఆచూకీ దొరకకపోవడంతో బుధవారం గాలింపు చర్యలు కొనసాగించారు.

 మధ్యాహ్నం టైంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. కాగా మృతుడి వివరాలు లభింలేదు. పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా ప్రమాదానికి ముందు మృతుడు మరో ఇద్దరు పిల్లలతో కలిసి ఆలయ పరిసరాల్లో తిరిగినట్లు తెలిసింది. వారి వివరాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. మృతుని బంధువులు ఎవరైనా ఉంటే జగద్గిరిగుట్ట పోలీస్​స్టేషన్​లో సంప్రదించాలని పోలీసులు కోరారు.  కేసు నమోదైంది.