నర్సంపేటలో డెంగ్యూతో బాలుడు మృతి

నర్సంపేట, వెలుగు : డెంగ్యూతో 9 ఏళ్ల బాలుడు చనిపోయిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ లో జరిగింది. 13వ వార్డుకు చెందిన మినహాజ్ (9) గత మూడు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. హాస్పిటల్ కి వెళ్ళగా డెంగ్యూ అని కన్ఫర్మ్ చేశారు.

ALSO READ :  భద్రాచలంలో రూ.3 లక్షల గంజాయి పట్టివేత

మంగళవారం సీరియస్ గా ఉండడంతో వరంగల్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు.