
మదనాపురం, వెలుగు : ప్రమాదవశాత్తు సంపులో పడి బాలుడు చనిపోయాడు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోవిందహళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన గౌనికాడి రాజు కొడుకు గౌనికాడి గట్టు (7) శుక్రవారం రాత్రి గ్రామంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర జరుగుతుండగా చూడడానికి వెళ్లాడు. దాసరి శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం తీసిన నీటి సంపులో బాలుడు పడిపోయాడు. బాలుడి కోసం గాలించగా సంపులో డెడ్‌బాడీ కనిపించింది.