పట్టపగలే బాలుడిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించిన ఓ మహిళా అడ్డంగా బుక్కయింది. రెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి బ్యాగులో పెట్టుకుంది. ఆ తర్వాత ఆటోలో బ్యాగ్ ను తీసుకెళ్తుండగా .. తోటి ప్రయాణికులు అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రెండేళ్ల బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసింది. బ్యాగులో బాలున్ని పెట్టుకుని ఆటోలో తీసుకెళ్లేందుకు యత్నించింది. పెగడపల్లి మండలం నంచర్ల గ్రామానికి చెందిన మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి.. బ్యాగ్ లో ఉన్న బాలుడిని గుర్తించి ఆమెను అడ్డుకున్నాడు. బాలుడిని ఎందుకు దొంగిలించావు అని మహిళను ప్రశ్నించాడు. అయితే బాలుడే తన వెంట వచ్చాడని నిందితురాలు బుకాయించింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఆ మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.