- జగిత్యాల జిల్లాలో కోరుట్ల టౌన్ లో ఘటన
కోరుట్ల,వెలుగు : కరెంట్ తీగలు తగిలి బాలుడికి తీవ్ర గాయాలైన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. కోరుట్ల టౌన్ లోని జవహర్రోడ్డులో అద్దె ఇంట్లో ఉండే సలందార రాజు-, లావణ్య దంపతుల మూడో కొడుకు ఆర్యన్(6). సోమవారం ఇంటి ముందు కొత్తగా నిర్మించిన మరో ఇంటి డాబాపైకి ఎక్కాడు. పక్కనే ఉన్న కరెంట్తీగలకు ప్రమాదవశాత్తు చేయి తగలడంతో కరెంట్‌షాక్ కొట్టడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.