స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లిన బాలుడు నీటిగుంటలో మునిగి శవమై తేలిన సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చేపలు పట్టేం దుకు నీటి గుంటలోకి దిగిన బాలుడికి ఈత రాకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
కూకట్ పల్లి పరిధిలోని శాంతి భూషణ్ బ్లెస్డ్ హోం సొసైటీలో ఉంటున్న 13ఏళ్ల బాలుడు సందీప్.. ఐడీఎల్ చెరువు పక్కన ఉన్న చేపలు పట్టేందుకు ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లాడు. అయితే చేపలు పట్టే క్రమంలో సందీప్ ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు.