
కొన్ని కాంబినేషన్స్ ప్రకటించినప్పుడే క్రేజీగా అనిపిస్తాయి. అలాంటి కాంబోనే మరోసారి రిపీట్ అవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా మరో చిత్రం కన్ఫామ్ అయ్యింది. ఎనిమిదేళ్ల క్రితం వీరి కాంబోలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘సరైనోడు’ చిత్రం సక్సెస్ సాధించింది. మళ్లీ వీరి కాంబినేషన్ అనగానే ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై క్యూరియాసిటీ పెరిగింది. ఇద్దరు మెగా హీరోలు నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ కాంబినేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని చెప్పారు.