Skanda Review: స్కంద మూవీ రివ్యూ

అఖండ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం స్కంద-ది ఎటాకర్. ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. మాస్ సినిమాలంటే బోయపాటికి పెట్టింది పేరు. భద్ర, తులసి, సింహా, లెజెండ్, అఖండ మూవీస్ తో మాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఫస్ట్ టైం రామ్ పోతినేనితో తీసిన స్కంద మూవీ ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలుసుకుందాం. హీరో రామ్ అంటేనే ఎనర్జీకి మారు పేరు. ఇక బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల డ్యాన్సుల విషయంలో తన క్రేజీనే సెపరేట్. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన స్కంద సగటు మాస్ ప్రేక్షకుడికి ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.

కథ :

ఆంధ్ర సీఎం (అజయ్ పుర్కర్) కూతుర్ని తెలంగాణ సీఎం (శరత్ లోహితాశ్వ) కొడుకు పెళ్లి పీటలమీద ఉండగానే లేపుకొస్తాడు. దీంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తీవ్రమైన వైరం మొదలవుతుంది. రాను రాను ఒకరికొకరు చంపుకునేలా పెరుగుతుంది. తెలంగాణా సీఎంని చంపేసి తన కూతుర్ని తెమ్మని ఆంధ్రా సీయం ఒకడిని రంగంలోకి దింపుతాడు. ఇక ఆ  యువకుడి నర నరాల్లో పౌరుషం ఉండేలా సెలెక్ట్ చేసుకుంటాడు. కట్టు దిట్టమైన భద్రతను కాదని ఒక్కడే వెళ్లిన ఆ యువకుడు..మరి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చాడా? అదలా ఉండగా రామకృష్ణ రాజు (శ్రీకాంత్) అనే ఒక ఫేమస్ ఐటీ బిజినెస్ మెన్ జైల్లో మగ్గుతుంటాడు. అతని కూతురు (సయి మంజ్రేకర్) చావుబతుకుల మధ్య ఆసుపత్రి బెడ్ మీద ఉంటుంది. సయి మంజ్రేకర్ హాస్పిటల్ ఉండటానికి కారణం ఏంటీ? అసలు ఇద్దరి ముఖ్యమంత్రుల పంచాయితీ ఎంతవరకు వచ్చింది. రామ్ కి.. శ్రీకాంత్ మధ్య గల సంభంధం ఏందీ అనేది అసలు కథ? 

కథ విశ్లేషణ: 

ఈ కథలో దున్నపోతుని ఆడించేవాడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ ఆకట్టుకుంటాడు. మాస్ సినిమాలకి బ్రాండ్ అయిన బోయాపాటి మార్క్ తరహా యాక్షన్ స్టార్టింగ్ ఫైట్ లోనే తెలుస్తుంది. హీరో రామ్ తెలంగాణా సీఎం కూతురుని (శ్రీలీల) పడేస్తూ..కాలేజీ సీన్స్ తో కాస్త పర్వాలేదు అనిపించేలా సాగుతుంది. బోయపాటి తనదైన సెంటిమెంట్ బంధాలతో అక్కడక్కడా ఎమోషన్ అనిపించేలా చేసిన పూర్తిగా ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదనే చెప్పుకోవాలి.  రామకృష్ణరాజు తో సినిమా స్టార్ట్ చేసిన డైరెక్టర్..రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యాలని హీరో ఎలా బద్దలుకొట్టాడనే అంశంతో కథని నడిపించాడు డైరెక్టర్. 

ఒక సీఎం కొడుకు మరొక సీఎం కూతుర్ని లేపుకుపోవడమనే ఎత్తుగడే వింతగా అనిపించలేదు. లాజిక్, కామన్ సెన్స్ అనేవి లేకుండా టోటల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో  సినిమా అంతా నింపేసి, భారీ బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో హడావిడి చేసేస్తే అది కమర్షియల్ సినిమా అనేలా చేశాడు బోయాపాటి. కొన్ని యాక్షన్ సీన్స్ తో మరి అధ్ ని చూపించడానికి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ఈ మూవీలో స్క్రీన్ మీద కనిపించే ఒక్క నటుడూ కూడా సరిగా కనిపించిన దాఖలు లేవు. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా నటించిన నటుల పేర్లు చెప్పడం కూడా అంత ఈజీ కాదు. 

ఇక ఫస్టాప్ చాలా అస్తవ్యస్తంగా సాగితే, సెకండాఫ్ మాత్రం అర్ధం పర్ధం లేకుండా సినిమా రన్ అవుతుంది. అక్కడక్కడా వర్తమాన రాజకీయాలు, ప్రభుత్వ ఉచిత పథకాలపై డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.  ఇక స్కంద సినిమా మొత్తంలో ఎక్కడ కూడా కామెడీ కనిపించదు. కనీసం హీరో..హీరోయిన్ ట్రాక్ అయినా సరిగా ఆడియన్స్ ను ఆకట్టుకోకపోవడం సినిమాకి మైనస్ అని చెప్పుకోవాలి. వీరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ చాలా డల్ గా ఉంది. బోయాపాటి మాస్ డైలాగులు కూడా యావరేజ్ అని చెప్పుకోవాలి. .

ఇక తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా భారంగా ఉంది. తెర మీద ఏమీ విషయం లేకపోయినా ఏదో జరిగిపోతోందన్న ఫీలింగుని బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో కలిగేలా చేసాడు. కల్ట్ మామ ఐటెం సాంగ్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇక రెండు సాంగ్స్ మోస్తరుగా ఉన్నప్పటికీ మిగతా సాంగ్స్ పెద్ద క్యాచీగా లేవు. మొదటి సాంగ్ మాత్రం మైకేల్ జాక్సన్ పాట స్టైలుని అనుకరించినట్టుగా కనిపించింది.

ఈ మూవీకి మెయిన్ గా కెమెరా, ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది..నిర్మాణ విలువల్లో మేకింగ్ స్టాండర్డ్స్, లొకేషన్స్ జస్ట్ ఒకే. కానీ ఇందులో నటించిన ఆర్టిస్ట్స్ అంతా సెకండ్ డ్రామా వార్ అనేలా..లోబడ్జెట్ వారిని పట్టుకొచ్చరని అనిపిస్తుంది.  

ఎవరెలా చేశారంటే:

రామ్ యాక్టింగ్ పరంగా ఎప్పటిలాగానే హై వోల్టేజులో ఉంది. క్యారెక్టరైజేషన్లో భిన్నమైన వేరియేషన్స్ కానీ, బలమైన వ్యక్తిత్వం కానీ లేవు. రొటీన్ హీరోగా కనిపించాడంతే. బోయపాటి స్టామినా లేదు. శ్రీలీల ఇలాంటి సినిమాలు ఇంకో రెండు చేస్తే తన కెరీర్ ముగిసిపోవడం ఖాయం. ఆమె  డ్యాన్సులు. అవి కూడా సరిగ్గా కంపోజ్ చేయలేదు. ఆకట్టుకునే స్టెప్ ఒక్కటి కూడా లేదు. హీరో శ్రీకాంత్, ఇంద్రజ కొన్ని సీన్స్ లో కనిపించారు తప్ప పెద్ద నిడివి అయితే లేదు. దగ్గుబాటి రాజాకి కాసిని డైలాగ్స్, పర్ఫార్మెన్స్ ఉన్న సీన్స్ బాగా పెట్టారు. మిగిలిన నటీనటులు ఓకే అనిపిస్తుంది. 

ఓవరాల్ గా చూసుకుంటే 

బోయపాటి మార్క్ లేని రామ్ ఎనర్జీకి సరిపోని స్టోరీ అనేలా ఉంది. అక్కడక్కడా మాస్ యాక్షన్స్..ఎమోషన్స్ ఆకట్టుకున్నాయి. మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి.