
"ఇంకేందిరా దాటేది నా బొంగులో లిమిట్సు.." అంటూ మాస్ జాతర చేసాడు హీరో రామ్. ఆయన హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మే 15వ తేదీ రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్బంగా ఈ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది.
మరీ ముఖ్యంగా రామ్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. రామ్ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంది. పూర్తిగా మాస్ గెటప్ లోకి మారిపోయిన రామ్.. పవర్ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టాడు. టీజర్ లో ఒక్కో షాట్ మాస్ కి కిక్కిచ్చేలా ఉంది. ప్రతీ ఫ్రెమ్ లో బోయపాటి మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఫుల్ ప్యాకుడ్ యాక్షన్స్ సీక్వెన్సెస్ తో టీజర్ ను నింపేసాడు బోయ. ఇక తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఎలక్ట్రిఫయింగ్ బీజీఎం తో ఫాన్స్ కు పూనకాలు తెప్పించాడు.
ఇక ఈ సినిమాతో రామ్ పాన్ ఇండియా స్టార్ అయిపోవడం ఖాయం అని కామెంట్స్ పెడుతున్నారు ఆయన ఫ్యాన్స్. మరి టీజర్ తోనే ఈ రేంజ్ లో దుమ్ముదులిపేసిన ఈ కాంబో మరి సినిమాతో ఏ రేంజ్ రచ్చ చేయనున్నారా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.